తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విస్మరించిందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారికి విలువ ఇవ్వకుండా సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు.అందుకే కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు.
ఈ క్రమంలోనే తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.







