టాలీవుడ్ బాక్సాఫీస్ మరో వారం రోజుల పాటు కార్తికేయుడికి సొంతం.వరుసగా నాలుగు వారాలు కార్తికేయ 2 సినిమా కు భారీ వసూలు నమోదు కాబోతున్నాయి.
ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగ రంగ వైభవంగా మరియు ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలు నిరాశ పరిచాయి.ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టడం లో బొక్క బోర్ల పడ్డాయి.
మొదటి రోజే సినిమాలకు నెగటివ్ టాక్ రావడం తో ఇక ముందు ముందు సినిమా లకు జనాలు వెళ్తారు అని నమ్మకం లేదు.పెద్ద ఎత్తున సినిమా లు ప్రమోషన్లు అయితే చేశారు గాని సినిమాల్లో కంటెంట్ లేదు అంటూ రివ్యూ లు వచ్చాయి.
ఆ రెండు సినిమా ల్లో ముఖ్యం గా రంగా రంగా వైభవంగా సినిమా ఉప్పెన హీరో వైష్ణవ తేజ్ నటించిన అంచనాలు భారీగా పెరిగాయి, పైగా సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను భారీగానే చేసి అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు.
ఉప్పెన హీరో అయినా.
మెగా హీరో అయినా కూడా సినిమా నిరాశ పర్చింది.మెగా సినిమా ఫ్లాప్ అవడం తో ఈ వారం కూడా కార్తికేయ 2 సినిమా ని తెలుగు బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్ని వారాలుగా కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి కొనసాగుతూనే ఉంది.ఇప్పుడు అది మళ్లీ వారం రోజుల పాటు కంటిన్యూ అవ్వబోతుంది.
ఇప్పటికే 100 కోట్ల వసూళ్ల కు పైగా బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టిన కార్తికేయ 2 ఈ వారం రోజుల్లో మరో 10 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది అని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.ఇప్పటికే కార్తికేయ 2 సినిమాకి భారీ వసూలు నమోదయ్యాయి, ముందు ముందు ఆ రికార్డు మరింతగా పదిలం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక హిందీలో కూడా ఈ సినిమా దాదాపు పాతిక కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఈ వారం కూడా అక్కడ వేరే సినిమాలు లేకపోవడంతో ఈ సినిమా కుమ్మేయడం ఖాయం.







