రణ్ బీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ డైరక్షన్ లో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర.ఈ సినిమాని తెలుగులో రాజమౌళి సమర్పిస్తున్నారు.
అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉన్నప్పటి నుంచి రాజమౌళి సినిమాకు సపోర్ట్ గా ఉన్నారని తెలుస్తుంది.అయాన్ కథ చెప్పినప్పటి నుంచి సినిమాకు తన సహకారం అందిస్తూ వచ్చారట రాజమౌళి.
అందుకే సినిమా మీద జక్కన్న అంత కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. బ్రహ్మాస్త్ర సినిమా విషయంలో రాజమౌళి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని చెప్పొచ్చు.
రాజమౌళి తన సినిమాలకు కూడా ఇంత టెన్షన్ ఫీల్ అవలేదు కానీ బ్రహ్మాస్త్ర విషయంలో ఎందుకో ఎక్కడో ఓ చిన్న టెన్షన్ రాజమౌళిలో కనిపిస్తుంది.సినిమాకు ఏర్పడిన బజ్ సరిపోదు అని ఎన్.టి.ఆర్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలిచాడు.అయితే ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యి జస్ట్ ప్రెస్ మీట్ లానే ముగించారు.ఫైనల్ గా బ్రహ్మాస్త్ర సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే ఓకే లేదంటే మాత్రం రాజమౌళి కి కూడా ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పొచ్చు.
ఆర్.ఆర్.ఆర్ తో మరో సూపర్ హిట్ అందుకున్న రాజమౌళి బ్రహ్మాస్త్రకి తన అభయం ఇచ్చారని తెలుస్తుంది.మరి సెప్టెంబర్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.







