కరోనా తర్వాత బాలీవుడ్ చాలా కష్టాలను ఎదుర్కొంటుంది.ఒకవైపు మన సౌత్ ఇండస్ట్రీ అక్కడ వందల కోట్లు వసూళ్లు చేస్తుంటే.
బాలీవుడ్ మాత్రం ఇప్పటికి కోలుకోలేక పోతుంది.మరి మరోసారి ప్రేక్షకుల ముందుకు మరో పెద్ద సినిమా రాబోతుంది.
బ్రహ్మాస్త్ర సినిమాతో టీమ్ అంతా మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది.ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.ప్రెజెంట్ టీమ్ అంతా ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మొదటిసారి తన భర్త రణబీర్ కపూర్ తో కలిసి నటిస్తుంది.ఇందులో నాగార్జున తో పాటు అమితాబ్ బచ్చన్ కూడా ప్రధాన పాత్రలో నటించారు.
ఇక ఈ సినిమాను మన సౌత్ లో నాలుగు భాషల్లో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తూ రిలీజ్ చేయడంతో తెలుగులో కూడా ఈ సినిమా వరుస ప్రొమోషన్స్ చేస్తుంది.

తాజాగా తెలుగు వర్షన్ కు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్ కు తారక్ గెస్ట్ గా విచ్చేసారు.నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఈ ఈవెంట్ లో తారక్ మాట్లాడుతూ.ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
అలాగే ప్రేక్షకులకు కూడా తారక్ ఈ వేదికపై సారీ చెప్పారు.

ఎందుకంటే ఈ వేదికను ఘనంగా నిర్వహించాలని అనుకున్నారట.కానీ వినకచవితి సందర్భంగా తగినంత పోలీస్ ప్రొటక్షన్ ఇవ్వలేమని పోలీసులు చెప్పడంతో ఈ ఈవెంట్ ను చాలా సింపుల్ గానే చేశామని అందుకు క్షమించమని కోరారు.మరి ఈ పాన్ ఇండియా సినిమా తెలుగులో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.







