నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానులు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పండుగ జరుపుకున్నారు.మొన్న వినాయక చవితి పండుగ ఏ స్థాయిలో జరుపుకున్నారో నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును అదే స్థాయిలో జరుపుకున్నారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 థియేటర్లలో జల్సా సినిమా ను ప్రదర్శించాలని అభిమానులు మొన్నటి వరకు భావించారు.నిన్నటి వరకు కూడా 500 థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శింపబడుతుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.కానీ నేడు ఈ సినిమా ఏకంగా 700 థియేటర్ల లో స్క్రీనింగ్ అయింది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.700 లకు పైగా థియేటర్ల లో సినిమా విడుదలవ్వడం అంటే మామూలు విషయం కాదు.మెగా అభిమానులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ స్థాయిలో జల్సా సినిమాను ఎంజాయ్ చేశారో అర్థం చేసుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యుత్సాహం చూపించడంతో థియేటర్లు బద్దలయ్యాయి.
చాలా చోట్ల అద్దాలు పలికాయి.కొన్నిచోట్ల సీట్ల ను విరగొట్టారు.
కొన్నిచోట్ల స్క్రీన్స్ చించేశారు.టెక్నికల్ సమస్యల కారణంగా పవన్ కళ్యాణ్ జల్సా సినిమా అక్కడక్కడ థియేటర్లకు మరియు వాటి యాజమాన్యాలకు చుక్కలు చూపించాయి.
చాలా చోట్ల ప్రశాంతంగానే సినిమా స్క్రీనింగ్ జరిగింది కానీ అక్కడక్కడ మాత్రం ఒక రేంజ్ లో గొడవలు జరిగాయి.అభిమానుల మధ్య తోపులాటలు జరిగాయి, తొక్కిసలాటలు కనిపించాయి.మొత్తానికి ఒక స్టార్ హీరో కొత్త సినిమా విడుదలైన సందర్భం లో ఉండే హడావుడి కంటే కాస్త ఎక్కువగానే నేడు జల్సా సినిమా ప్రదర్శింపబడిన థియేటర్ల వద్ద కనిపించింది.500 థియేటర్లలో అనుకుంటే ఏకంగా 700 థియేటర్లలో సినిమా విడుదల అవ్వడం అద్భుతమైన రికార్డు అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ ఇలాంటి రికార్డులను గతంలో ఎన్నో సొంతం చేసుకున్నారు, కానీ ఇది చాలా అరుదైన రికార్డు అంటూ ఆయన అభిమానులు మురిసిపోతున్నారు.








