బర్త్‌ డే స్పెషల్‌ : ఇదెక్కడి ఫాలోయింగ్.. ఇదెక్కడి అభిమానం

పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉండరు భక్తులు మాత్రమే ఉంటారు అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తెగ చెప్పేసుకుంటూ ఉంటారు.అది నిజమేనేమో అనిపిస్తుంది కొన్నిసార్లు.

 Birthday Special Here Is The Following Here Is The Fandom , Birthday Special, P-TeluguStop.com

వారు చేసే హంగామా అంతా ఇంకా కాదు.నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్న హంగామా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా హంగామా సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.

దేశంలో మరే హీరోకైనా ఈ స్థాయి అభిమానులు ఉంటారా ఉన్నారా అనే అనుమానాలను చాలా మంది సినీ వర్గాలకు చెందిన వారు అంటున్నారు.పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే ఏ స్థాయిలో సందడి చేస్తారో మరోసారి నిరుపితమైంది.

జల్సా సినిమా ఏకంగా 600 థియేటర్లలో రీ రిలీజ్‌ అయింది.ప్రతి థియేటర్లో కూడా అభిమానులు చేస్తున్న సందడి అంతా అంతా కాదు.

థియేటర్లను అలంకరించడం మొదలుకొని లోపట డాన్సులు చేసే వరకు సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్న హంగామా తో సోషల్ మీడియా దద్దరిల్లుతోంది.

బాబోయ్ ఇదేం అభిమానం ఇదేం ఫాలోయింగ్ అంటూ పవన్ కళ్యాణ్ గురించి జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది.ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాలు మరియు రాజకీయం అంటూ ఎక్కువ సినిమాలు చేయలేక పోతున్నాడు.

అయినా కూడా ఆయనకు అభిమానులు ఏ మాత్రం తగ్గడం లేదు.ఆయన ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కూడా వేరే రాజకీయ పార్టీల నాయకులు నేతలు కూడా ఆయనకు అభిమానులు అనడంలో సందేహం లేదు.

అలాంటి వారు కూడా ఈ రోజు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ తమ అభిమానంతో చాటుకుంటున్నారు.పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఇలాంటి అభిమానులు అభిమానం ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube