ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఘటనకు బాధ్యత తీసుకుంటూ.మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ డిమాండ్ చేశారు.
పేదల జీవితాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.గర్భవతి అయిన ఇండియన్ టూరిస్ట్ మరణానికి బాధ్యత వహిస్తూ.
పోర్చుగల్ దేశ ఆరోగ్య మంత్రి రాజీనామా చేశారు.ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రభుత్వ డాక్టర్లు నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలం అయి నలుగురు మహిళలు మృతి చెందారు.
దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి హరీష్ రావు రాజీనామా చేస్తారా.? అని మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.







