బీజేపీ నేతలకు తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు.దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు పథకం అమలు చేయాలని ఛాలెంజ్ చేశారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ అందిస్తున్న దళితబంధుపై బీజేపీ నేతలు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.ఉచితాలు రద్దు చేయాలని మాట్లాడటం దుర్మార్గమని వ్యాఖ్యనించారు.
దళిత వర్గాలపై బీజేపీకి ప్రేమలేదని.అందుకే గుజరాత్, యూపీలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని విమర్శించారు.







