విడాకులు ప్రకటించి కలిసిపోయిన సెలబ్రేటీ జంట.. మధ్యలో ఏం జరిగిందంటే?

బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తమ్ముడు అయినా మోడల్ రాజీవ్ సేన్, అతని భార్య చారు అసోపాతో విడిపోతున్నట్లుగా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే.ఇద్దరు విడాకులు తీసుకొని వారి వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్నారు అంటూ జోరుగా వార్తలు వినిపించగా ఆ వార్తలు నిజమే నేను నా భర్తతో విడాకులు తీసుకుంటున్నాను అంటూ చారు అసోపా సైతం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

 Charu Asopa And Rajeev Sen Announced Decide Keep Their Marriage Details, Charu-TeluguStop.com

అంతే కాకుండా ఆమె రాజీవ్ సేన్ కు విడాకుల నోటీస్ కూడా పంపినట్లు ఆమె తెలిపింది.దీంతో ఈ జంట విడాకులు తీసుకొని విడిపోవడం ఖాయం అని అభిమానులు అందరూ భావించారు.

కానీ తాజాగా వీరిద్దరూ అభిమానులకు ఊహించని విధంగా ఒక మంచి శుభవార్తలో చెప్పారు.అదేమిటంటే విడాకులు తీసుకొని విడిపోవాలి అనుకున్నది నిజమే అయినప్పటికీ దానిని రద్దు చేసుకుంటూ మళ్ళీ తాము ఒకటి అవుతున్నాము అని గుడ్ న్యూస్ ని అందించారు ఈ జంట.తమ కూతురు జియానా కోసం ఇద్దరూ కలిసి ఉండాలి అని నిర్ణయించుకున్నాము అని సోషల్ మీడియా వేదికగా తెలిపారు రాజీవ్, చారు అసోపా. తనలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఇంట్లో పూజ చేసిన తరువాత, ఈ జంట తమ కూతురు జియానాతో కలిసి దిగిన ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.

ఆ ఫోటోని షేర్ చేస్తూ తమ విడాకుల ప్రకటనలో వెనక్కి తీసుకుంటున్నాం అని తెలిపారు.

పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయంటారు.అయితే దానిని మేం అమలు చేయడమే మిగిలి ఉంది.అవును.

మా వివాహ బంధానికి మేం స్వస్తి చెప్పాలనుకున్నాం.మా నిర్ణయాన్ని కూడా ప్రకటించాము.

ఇక మా మధ్య ఏం లేదు, మేం చివరి దశకు చేరుకున్నామని అనుకున్నాం.కానీ మా విడాకుల నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నాం.

విడాకులు అనేవి మా ఎంపిక మాత్రమే అని గ్రహించాం అని రాసుకొచ్చారు.అదేవిధంగా ముందులాగే మా వైవాహిక జీవితాన్ని సంతోషంగా కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చాము.

ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.తల్లిదండ్రులుగా మా కూతురు జియానాకు ఉత్తమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాము అని రాసుకొచ్చారు రాజీవ్, చారు ల జంట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube