హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన స్నో వరల్డ్ మూత పడింది.దీన్నిరాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు సీజ్ చేశారు.గత కొన్ని సంవత్సరాలుగా కార్యకలాపాలు సాగిస్తున్న స్నో వరల్డ్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.16 కోట్ల పన్నును ఎగవేసింది.ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు స్నో వరల్డ్ స్పందించకపోవడంతో.పర్యాటక శాఖ అధికారులు సీజ్ చేశారు.రాష్ట్రంలో మరో 16 పర్యాటక కేంద్రాలు కూడా పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
నిర్దేశించిన గడువులోగా పన్నులు కట్టకపోతే వాటిని కూడా సీజ్ చేస్తామని ప్రకటించారు.







