దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో పెన్షన్లు ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంగా నిలిచిందని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ శ్రీ తాత మధుసూదన్ అన్నారు ముదిగొండ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఉదయం ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజలు ఉంటే రమారమి 50 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయని దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రతిష్టాత్మంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు పార్టీలకతీతంగా ప్రజా ప్రతినిధులు అన్ని రాజకీయ పక్షాలు ఇంకా ఎవరైతే అర్హత ఉన్నారో వారిని గుర్తించి ఎంపీడీవో కార్యాలయంలో అందజేస్తే వారికి కూడా పెన్షన్ మంజూరు అయితే అన్నారు ఇది నిరంతర ప్రక్రియని 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి అర్హత ఉందన్నారు.
ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు సామినేని హరిప్రసాద్ తదితర ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన పలు సమస్యలపై ఆయన స్పందించారు మండల కేంద్రంలోని సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు ముదిగొండ కళాశాలలో మౌలిక వసతులు తమ దృష్టికి వచ్చాయని చాయ శక్తుల కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ప్రజల ఇచ్చిన సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్మన్ తో కలిసి అభివృద్ధికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ మాట్లాడుతూ, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇబ్బందులకు గురి కాకుండా సుఖ సంతోషాలు తో ఉండేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో మరో అతిధి స్థానిక ఎమ్మెల్యే బట్టి విక్రమార్క జడ్పీటీసీ పసిడి దుర్గ డిసిబి డైరెక్టర్ వేముల శీను రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పోట్ల వెంకటప్రసాద్ ఈ కార్యక్రమం లో పాల్గొనగా ఈ కార్యక్రమానికి ఎంపిపి సామినేని హరిప్రసాద్ అధ్యక్షత వహించారు అనంతరం పెన్షన్లను వారి చేతుల మీదుగా అందజేశారుమాజీ మండల అధ్యక్షులు మీగడ శ్రీనివాస్ కు పరామర్శఅనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ మండల అధ్యక్షుడు మీగడ శ్రీనివాస్ యాదవ్ తల్లి వెంకట్ నరసమ్మ గారుమృతిచెందగా శ్రీనివాస్ స్వగృహానికి వెళ్లి ఆయనను కుటుంబాన్ని పరామర్శించారు ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు
.