పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలంలో విద్యార్థుల మధ్య ఘర్షణ రేజర్ బ్లేడ్ తో దాడికి దారితీసింది.మత్స్యపురి జెడ్పీ హెచ్ స్కూల్ లో ఈ ఘటన జరిగింది.
రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు పరస్పర దాడులకు దిగారు.ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అయితే స్కూల్ ప్రధానోపాధ్యాయుని నిర్లక్ష్యం వలనే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపణలు వస్తున్నాయి.సమాచారం అందుకున్న నరసాపురం పోలీసులు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.