విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్ ప్రభుత్వం విజయం సాధించింది.తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తూ.
సీఎం కేజ్రీవాల్ సభలో బలాన్ని నిరూపించుకోవడానికి బల పరీక్షకు సిద్ధమైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
ఈ తీర్మానానికి ఆప్ తరపున 59 మంది ఎమ్మెల్యేలు మద్ధతు పలికారు.దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం విజయం సాధించిందని స్పీకర్ ప్రకటించారు.
ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లు ఉండగా… వెరసి ఆప్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా కేజ్రీవాల్ సర్కారుకు మద్దతుగా నిలిచి తమ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు.ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఢిల్లీలోనూ ఆప్ సర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్ర చేసిందని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు.
ఆప్ ఎమ్మెల్యేలు నిజాయతీపరులన్న ఆయన.వారి ప్రభుత్వాన్ని వారే కాపాడుకున్నారని కితాబిచ్చారు.







