మళయాళంలో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న మాళవిక మోహనన్ తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేయకపోయినా సరే విజయ్ మాస్టర్ సినిమా ద్వారా ఇక్కడ పాపులారిటీ తెచ్చుకుంది.తెలుగులో సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న అమ్మడు సినిమాలతో సంబంధం లేకుండా ఫోటో షూట్స్ తో కాలం వెళ్లదీస్తుంది.
అమ్మడి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటో షూట్స్ చూస్తే కుర్రాళ్లకి నిద్రపట్టదని చెప్పాలి.
ఇక లేటెస్ట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో తన గ్లామర్ షోతో మరోసారి మెప్పించింది మాళవిక మోహనన్.
బ్లాక్ అండ్ బ్లాక్ లో మాళవిక అదరగొట్టేసింది.గ్లామర్ షో విషయంలో పెద్దగా మొహమాటం ఏమి పడని అమ్మడు తన హాట్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ని మరింత పెంచుకుంటుంది.
మాళవిక మోహనన్ చేస్తున్న ఈ ఫోటో షూట్స్ ఆమె ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని తెగ డిస్ట్రబ్ చేస్తున్నాయని చెప్పొచ్చు.ఇక సినిమాల విషయానికి వస్తే హిందీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్న మాళవిక మళయాళంలో రెండు సినిమాలతో బిజీగా ఉంది.
తెలుగులో స్టార్ సినిమా ఒకటి చర్చల్లో ఉందని తెలుస్తుంది. అదే జరిగితే మాత్రం తెలుగులో మాళవికకి స్టార్ రేంజ్ రావడం పక్కా అని ఫిక్స్ అవ్వొచ్చు.







