వెండితెర నటిగా ఎన్నో సినిమాలలో నటిస్తూ అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నిన్నటి తరం హీరోయిన్లలో నటి రమ్యకృష్ణ ఒకరు.ఈమె తెలుగు తమిళ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా నటించడమే కాకుండా, విలన్ పాత్రలలో కూడా అందరిని మెప్పించారు.
ఇలా ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ప్రస్తుతం పలువురు హీరోలకు హీరోయిన్లకు మదర్ క్యారెక్టర్లలో నటిస్తూ సందడి చేస్తున్నారు.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మదర్ క్యారెక్టర్ ద్వారా అందరిని మెప్పించిన రమ్యకృష్ణ తాజాగా లైగర్ సినిమా ద్వారా మరోసారి మదర్ క్యారెక్టర్ లో దుమ్ము లేపారు.లైగర్ సినిమాలో రమ్యకృష్ణ మాస్ పర్ఫామెన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయిందని చెప్పాలి.ఇది ఇలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్యకృష్ణ బాలీవుడ్ సినిమాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తనకు బాలీవుడ్ సినిమాలు అచ్చి రావని చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.తాను ఇదివరకే హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థలలో స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ ఆ సినిమాలు కూడా హిట్ కాలేదని, తనకు బాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా కలిసి రాలేదంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం రమ్యకృష్ణ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె సినిమాల విషయానికొస్తే త్వరలోనే తన భర్త కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.







