అనంతపురం జిల్లాలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై కేసు నమోదైంది.సస్పెండ్ కు గురైన కానిస్టేబుల్ ప్రకాష్ ఫిర్యాదు మేరకు.
ఎస్పీ ఫకీరప్ప, ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతు, సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషాలపై రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ క్రమంలో సెక్షన్లు 167, 177, 182 కింద నమోదు చేసినట్లు టూ టౌన్ సీఐ వివరాలు వెల్లడించారు.
ఈ విషయంపై జిల్లా పోలీస్ అధికారులతో డీఐజీ రవి ప్రకాష్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.







