సోషల్ మీడియా పరిధి పెరుగుతున్నవేళ అనునిత్యం అనేకరకాల వీడియోలు వైరల్ అవుతూ వున్నాయి.ముఖ్యంగా జంతువులకు సంబంధించినటువంటి అనేకరకాల వీడియోలు మనం చూడవచ్చును.
నెటిజన్లను ఈ రకమైన విడియోలో ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.విషయంలోకి వెళితే, ఈ భూమిపై ఎలాంటి జీవి అయినా దానికి యెంత ఆకలి వేసినా తన సొంత జాతికి చెందిన జీవులను తినదు.
ఒకవేళ రెండింటి మధ్య పోరాటం జరిగి చంపేసుకున్నా.ఆహారం కోసం మాత్రం సొంత జాతి జీవులను తినడం చాలా తక్కువ అనే చెప్పాలి.
అయితే అప్పుడప్పుడు కొన్ని జీవులలో ఈ రకమైన చర్యలను మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.
ఇలా తమ సొంత జాతి జీవులను తినడాన్ని ‘కేనిబాలిజం’ అంటారు.
పాముల వంటి కొన్నిరకాల జీవుల్లో మాత్రమే ఇలాంటి కేనిబాలిజం కనిపిస్తుంటుంది.అయితే మొసళ్ళులో ఆ రకమైన అలవాటుని మనం చూడలేము.
కానీ ఇదే తరహాలో ఓ మొసలి మరో మొసలిని పట్టి తినేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న సిల్వర్ స్ప్రింగ్స్ స్టేట్ పార్క్ లో టామీ షా అనే వ్యక్తి ఓ వీడియో తీసి యూట్యూబ్ లో షేర్ చేసాడు.
నేషనల్ పార్క్ లో ఉన్న సరస్సులో ఓ పెడల్ బోట్ లో వెళుతుండగా.ఓ పెద్ద మొసలి కదులుతుండటం కనిపించింది.
దాన్ని వీడియో తీయడం మొదలుపెట్టిన టామీ షా.అక్కడ జరుగుతున్నది చూసి షాక్ అయ్యాడు.
సదరు వీడియోలో గమనిస్తే, ఓ పెద్ద మొసలి మరో మొసలిని కరుచుకుని మింగడానికి ప్రయత్నిస్తోంది.అలా దాన్ని గట్టిగా పట్టుకుని.నీటిలోంచి పైకి ఎగరేసినట్టుగా చేస్తూ మళ్లీ కిందికి బాదడం మనం చూడవచ్చు.తన బోటుకి సమీపంలోనే ఇదంతా జరిగింది.
అతడు దీన్ని వీడియో తీశాడు.ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.
సాధారణంగా మొసళ్లు కలిసి ఉంటాయని.గుంపులుగా వేటాడుతుంటాయని నిపుణులు వివరిస్తున్నారు.
కానీ ఇలా ఒక మొసలి మరో మొసలిని పట్టుకుని తినడం చాలా అరుదుగా జరుగుతుంది.