బీజేపీ బహిష్కృత మహిళా నేత, మాజీ ఐఏఎస్ అధికారి భార్య సీమా పాత్రాను రాంచీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఇంట్లో పని మనిషిని చిత్రహింసలకు గురి చేసిన ఆరోపణల నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
పనిమనిషి సునీతపై అమానుషంగా ప్రవర్తించడంతో పాటు.ఆమె నాలుకతో టాయిలెట్ ను శుభ్రం చేయించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.
అదేవిధంగా తన శరీరాన్ని వేడి వస్తువులతో కాల్చేవారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ క్రమంలో పరారైనా సీమా పాత్రాను రాంచీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆమెను న్యాయస్థానం ముందు హాజరుపరిచిన అనంతరం జైలుకు తరలించనున్నారు.మరోవైపు సీమా చిత్రహింసలకు గురి చేసిన వార్తలపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖాశర్మ స్పందించారు.
ఈ నేపథ్యంలో నిందితురాలిని అరెస్ట్ చేయాలంటూ ఝార్ఖండ్ డీజీపీకి లేఖ రాశారు.ఈ ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు.







