టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.కాగా ఇదే విషయంపై టాలీవుడ్ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.
హీరో నిఖిల్ ని ఏకపారేశాడు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమ్మారెడ్డి మాట్లాడుతూ.
దిల్ రాజు గురించి నిఖిల్ ప్రస్తావించడం తప్పు లేనప్పుడు ఏడాల్సిన అవసరం లేదు.అలాగే సినిమా హిట్ అయినప్పుడు కాలర్ ఎగరేయాల్సిన పనిలేదు.
సక్సెస్ వచ్చినప్పుడు ఒక మాట, లేదంటే ఫ్లాప్ వచ్చినప్పుడు మరో మాట్ మాట్లాడకూడదు.నీకు ఏదైనా ఉంటే ముందు మాట్లాడు.
దిల్ రాజు నీ సినిమాని వాయిదా వేసుకోమని చెప్పినప్పుడు ఆరోజు ఎందుకు తిట్టలేదు.
ఒకవేళ నిజంగా నీకు దమ్ము ఉంటే దిల్ రాజు సపోర్ట్ చేయడం లేదని ఆ రోజే మైక్ లాక్కుని నా కొడకా నువ్ అట్టా చేయలేదు అని నిలదీయవచ్చు కదా అని తెలిపారు తుమ్మారెడ్డి భరద్వాజ.
అలాగే నిఖిల్ నువ్వు దిల్ రాజు ఇంటికి వెళ్లి నువ్ అడుక్కున్నావ్.అని ఆయన చెప్తున్నాడు.
అది అబద్ధమా? లేఖ నిజమా అన్న విషయం గురించి నువ్వు స్టేజ్ పై ఉన్న చెప్పాలిగా.అసలు నువ్ ఎవడివి దిల్ రాజు ఇంటికి వెళ్లడానికి? నీకు ఏమి అవసరం? అసలు సినిమా రిలీజ్‌తో హీరోకి ఏం పని? నాకు థియేటర్స్ ఇవ్వడం లేదని నువ్ ఎందుకు స్టేట్ మెంట్ ఇచ్చావ్.అసలు నీకు ఏం సంబంధం.నువ్ హీరోవి హీరో పనులు హీరో చేసుకోవాలి.డబ్బులు తీసుకోకుండా నువ్వేం సినిమా చేయలేదు కదా అంటూ నిఖిల్ కీ చురకలు అంటీంచాడు భరద్వాజ.

అలాగే నీకు నిజంగా అంత దమ్ము ఉంటే పోటీకి వెళ్లాలి.ఎవడికి ఎంత దమ్ము ఉందో తేలిపోయేది.దిల్ రాజు నీ సినిమాను వద్దన్నారే అనుకుందాం.
నీకు దైర్యం ఉంటే రిలీజ్ చేయొచ్చు కదా.మాచర్ల నియోజక వర్గం సినిమాకి పోటీగా కార్తీకేయ 2ను రిలీజ్ చేసే ధైర్యం ఉన్నప్పుడు ఆరోజు థాంక్యూ మూవీకి పోటీగా ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు.అంత దమ్ములేదా? అంటూ నిఖిల్ పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.







