బోయపాటి కోసం భారీగా బరువు పెరగనున్న హీరో రామ్.. మరీ ఆ తర్వాత సినిమాలు?

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవలే రామ్ పోతినేని ది వారియర్ ప్రేక్షకుల్లో పలకరించిన విషయం తెలిసిందే.

 Ram Pothineni Shocking Decision Boyapati Srinu Film Details, Ram Pothineni, Shoc-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరవాలేదు అని అనిపించింది.ఇక ఈ సినిమాలో పాటలు విపరీతమైన క్రేజ్ ని ఏర్పరచుకున్నాయి.

అంతేకాకుండా యూట్యూబ్ లో ఈ పాటలు రికార్డులను కూడా సృష్టించాయి.ఇక ఇందులో రామ్ పోతినేని సరసన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ తన తదుపరి సినిమాలపై దృష్టిని పెట్టాడు.

ఈ నేపథ్యంలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరితెక్కబోతున్న ఒక సినిమాలో చేస్తున్నాడు రామ్ పోతినేని.

కాగా తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ సినిమా కోసం హీరో రామ్‌ తన లుక్‌ని పూర్తిగా మార్చబోతున్నట్లుగా సమాచారం.

అంతే కాకుండా ఇందుకోసం సుమారు 11 కిలోల బరువు కూడా పెరగనున్నట్లు వార్త జోరుగా వినిస్తోంది.కాగా స్క్రిప్ట్ డిమాండ్ మేరకు రామ్ కూడా ఈ కండిషన్‌కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Boyapati Srinu, Krithi Shetty, Ram Boyapati, Ram, Ram Pothineni, Warrior,

దీంతో రెండు పాత్రల్లో వేరియేషన్స్‌ కోసం రామ్‌ కొత్తగా మేకోవర్‌ అవనున్నారట.కాగా అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న ప్రాజెక్ట్‌ కావడం, అందులోనూ పాన్‌ ఇండియా మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా సెట్స్‌పైకి రానున్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

మరి అఖండ సినిమాతో బాలకృష్ణకు బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన బోయపాటి మరి రామ్ పోతినేని కీ ఏ రేంజ్ లో హిట్ ను అందిస్తారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube