వైరల్: ఓ చిన్నారిపై మనసు పారేసుకున్న కోతి... ఇది చూడండి మనుషులకన్నా కోతులేనయం అంటారు!

ఈ విశాల జగతిలో ప్రేమ అనేది ప్రతి జీవిలో ఒకే విధంగా ఉంటుంది.దానికి అనేక రూపాలు… ముఖ్యంగా పిల్లలపైన తల్లులు చూపించే ప్రేమను మనం వర్ణించలేము.

 Viral A Monkey Who Lost His Mind On A Child , Monkey, Kid, Playing, Latest News,-TeluguStop.com

ఇక తమ పిల్లలని తాము ఎవరైనా ప్రేమిస్తారు.కానీ ఇక్కడ ఓ జంతువు ఓ మనిషి పిల్లపైన ప్రేమ చూపించడం నిజంగా అద్భుతంగానే చెప్పుకోవాలి.అవును… ఇక్కడ వీడియోలో ఏముందో ఒకసారి చూస్తే… ఓ రోడ్డుపైన ఆడుకుంటున్న పిల్లాడి దగ్గరకు వెళ్లిన కోతి వాడి తలపై నిమురుతూ… లాలిస్తూ ఉండడం మనం చూడవచ్చును.మనుషుల కంటే జంతువులు ఎంతో ప్రేమను కలిగి వుంటాయనడానికి ఇదే నిదర్శనం.

అయితే అలా ఆ కోతి ఆ పిల్లాణ్ణి లాలిస్తూ వున్న సమయంలో ఆ బిడ్డ తల్లి చూసి, కోతి దగ్గరకు వెళ్లి, తన బిడ్డను తీసుకొనే ప్రయత్నం చేస్తుంది.వెంటనే కోతి నేను ఇవ్వను పొమ్మంటూ… అని అన్నట్టుగా ఆ పిల్లాణ్ణి గట్టిగా హత్తుకున్న ఎమోషనల్ సీన్ మనం సదరు వీడియోలో చూడవచ్చును.

ఇక సోషల్ మీడియా రోజురోజుకీ పెరుగుతున్నవేళ ఇలాంటి వీడియోలు అనేకం ట్రాండ్ అవుతూ వున్నాయి.ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి వీడియోలు అనేకం ఇటీవల బాగా వైరల్ అవుతున్నాయి.

పెంపుడు జంతువులు అనేవి తమ యజమానుల పట్ల ఎంతో అనికతభావంతో ఉంటాయి.ఇటీవల కాలంలో మనం చూసుకుంటే, వన్య ప్రాణులు చాలా వరకు కూడా ఆహారం కోసమో, నీళ్లకోసమో వనాలను విడిచి జనారణ్యాల్లోకి వచ్చేస్తున్నాయి.

వీటిలో వానరాలు ముందు వరుసలో ఉంటాయి.వీటికి మనుషులకు చాలా దగ్గర పోలిక ఉంటుంది.

ముఖ్యంగా చిన్నపిల్లతో కోతులు చేసే అల్లరి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక ప్రస్తుతం ఇక్కడ మీకు కనబడుతున్న వీడియో ఇంటర్నెట్‌లో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది.

చిన్నారిపట్ల ఆ వానరం చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube