జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.ఆయనతో పాటు ఆ పార్టీకి చెందిన మరో ఏడుగురిపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.
ఈ నెల 19న కడప జిల్లా సిద్ధవటంలో కోనేటి వెంకటరమణ అనే వ్యక్తి తనపై వీరు దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.పవన్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర ఏర్పాట్లను పరిశీలిస్తుండగా.
నాదెండ్ల సమక్షంలో అతనిపై దాడి చేసినట్టువచ్చిన ఆరోపణలపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.







