టాలీవుడ్ ఇండస్ట్రీకి ఊహించని స్థాయిలో గుర్తింపు రావడానికి కారణమైన దర్శకులలో దర్శకధీరుడు రాజమౌళి ఒకరనే సంగతి తెలిసిందే.స్టూడెంట్ నంబర్1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు అపజయమెరుగని దర్శకుడిగా పాపులర్ అయిన జక్కన్న పలు సినిమాలకు సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.
అయితే ప్రస్తుతం రాజమౌళిని బాయ్ కాట్ చేయాలంటూ ట్రెండింగ్ కొనసాగుతోంది.
రాజమౌళిని బాయ్ కాట్ చేయాలని నెటిజన్లు ఈ విధంగా పిలుపునివ్వడానికి ముఖ్యమైన కారణమే ఉంది.
రాజమౌళి బాలీవుడ్ మూవీ అయిన బ్రహ్మాస్త్రం సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండాలని అలా ఉండకపోతే బాయ్ కాట్ చేస్తామంటూ పిలుపునిస్తున్నారు.
బాయ్ కాట్ ట్రెండింగ్ గురించి రాజమౌళి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వల్ల సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
ఓటీటీల హవా కొనసాగుతుండటంతో ప్రస్తుతం పెద్ద సినిమాలకు సైతం భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.ఇలాంటి సమయంలో బాయ్ కాట్ ట్రెండింగ్ వల్ల సినిమాలకు భారీ మొత్తంలో నష్టాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
బాయ్ కాట్ ట్రెండింగ్ వల్ల థియేటర్లలో సినిమాలను చూడాలంటే ప్రేక్షకులు సైతం భయపడే పరిస్థితి ఏర్పడుతోంది.

ఇండస్ట్రీ పెద్దలు కావాలనే సినిమాలను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చే వాళ్లపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రాజమౌళి సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు.అలాంటి డైరెక్టర్ ను సైతం వివాదాస్పద అంశాలలోకి లాగడం ఆయన అభిమానులను ఎంతగానో బాధ పెడుతోంది.
ఇండస్ట్రీకి నష్టం జరిగే విధంగా కొంతమంది సోషల్ మీడియాలో వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.







