రాజధాని అమరావతి రైతులు సెప్టెంబర్ 12 నుంచి మరో మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.అమరావతి నుంచి అరసవెల్లి సూర్య భగవానుడి వద్దకు సుమారు 630 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్రను చేపట్టనున్నారు.
ఈ క్రమంలో తమ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మంగళగిరిలోని రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
మహా పాదయాత్రకు రూట్ మ్యాప్ ను అమరావతి రైతు జేఏసీ నేతలు సిద్ధం చేస్తున్నారన్నారు.
ఒకటి రెండు రోజుల్లో రూట్ మ్యాప్ సిద్ధమవుతుందని నేతలు చెప్పారు.గత సంవత్సరం న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో అమరావతి నుంచి తిరుపతి వరకు రాజధాని రైతులు, మహిళలు పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే.
రెండో విడత పాదయాత్రలో గణాంకాలతో సహా రాష్ట్ర ఆదాయ వనరుగా అమరావతి ఎలా ఉంటుందనేది ప్రజలకు తెలియజేయనున్నట్లు వెల్లడించారు.