కోర మీసంతో మాస్ లుక్ లో మెగాస్టార్.. కొత్త మేకోవర్ కు అంతా ఫిదా!

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఎప్పుడు లేనంత స్పీడ్ గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.ఈయన నటించిన ఆచార్య సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి ఈయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా మిగిలి పోయింది.

 Megastar Chiranjeevi New Photo Going Viral In Social Media , Viral Photo, Social-TeluguStop.com

దీంతో మెగాస్టార్ తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టి ఎలాగైనా ఆచార్యను మరిపించే హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

ప్రెసెంట్ చిరు చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి.

వాటిలో వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్) ఒకటి.మెగాస్టార్ 154వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మాస్ రాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం విదితమే.

ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా సెట్స్ నుండి మెగాస్టార్ లుక్ ఒకటి బయటకు వచ్చింది.శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా సెట్స్ లో నుండి ఒక పిక్ బయటకు రాగ ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అయ్యింది.

ఈ ఫొటోలో మెగాస్టార్ కోరమీసంతో మాస్ లుక్ లో మరింత యంగ్ గా కనిపిస్తున్నాడు.

దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు.

ఇక ఈ సినిమాను మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు.చిరు ఈ లోపు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించ నున్నాడు.

ఒకటిబర్ 5న చిరు నటించిన గాడ్ ఫాథర్ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.

Telugu Bobby, God, Chiranjeevi, Mohan Raja, Ravi Teja, Salman Khan, Shruthi Hasa

తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్.ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, సునీల్, నయనతార, పూరీ జగన్నాథ్, అనసూయ వంటి స్టార్స్ నటించడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube