బీజేపీపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలపై కేంద్రం దృష్టి సారించిన నేపథ్యంలో.
ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీ నిరక్షరాస్యుల పార్టీ అని విమర్శించారు.
అందుకే దేశాన్ని కూడా నిరక్షరాస్యతతో మగ్గేలా చేయాలని చూస్తోందని ఆరోపించారు.బీజేపీ తమ సొంత రాష్ట్రాల్లోనే పలు ప్రభుత్వ పాఠశాలలను మూసివేసిందని ఎద్దేవా చేశారు.
ఈ క్రమంలో కేంద్ర హయాంలో అనేక స్కూళ్లు మూతపడటంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.







