పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా అభిమానుల సందడి మామూలుగా ఉండదు.ఆయన ప్రతి సంవత్సరం పుట్టిన రోజు వేడుకలను నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపించరు.
కానీ ఆయన అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలను నిర్వహించడం కామన్ గా జరుగుతూ వస్తోంది.ఆ మధ్య మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన పోకిరి సినిమా మరియు ఒక్కడు సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున స్క్రీనింగ్ చేసిన విషయం తెలిసిందే.
ఆయన సినిమాల స్థాయిలోనే పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా ను కూడా భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అభిమానులు ఇటీవలే ప్రకటించారు.తాజాగా జల్సా సినిమా మాత్రమే కాకుండా తమ్ముడు సినిమా ను కూడా పెద్ద ఎత్తున థియేటర్ల లో విడుదల చేయబోతున్నట్లుగా పవన్ కళ్యాణ్ అభిమానులకు అభిమానుల సంఘం నాయకులు తెలియజేశారు.
అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం తమ్ముడు సినిమా కంటే ఖుషి సినిమా విడుదల చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది కదా అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఖుషి సినిమా విడుదల చేయడం ద్వారా అభిమానుల్లో మరింత ఉత్సాహం ని నింపిన వారు అవుతారు, తమ్ముడు సినిమా కంటే ఆ సినిమా కు ఎంతో మంచి పేరు పవన్ కళ్యాణ్ కి వచ్చింది.
యూత్లో విపరీతమైన క్రేజీ ని తెచ్చిపెట్టిన ఖుషి సినిమా ఎందుకు రిలీజ్ చేయడం లేదంటూ అభిమానులు కొందరు ప్రశ్నిస్తున్నారు.అయితే ఆ సినిమా విడుదలకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, అందుకే తమ్ముడు సినిమా ను విడుదల చేస్తున్నామంటూ వారు పేర్కొంటున్నారు.
వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్ బర్త్ డే వరకు ఆ సినిమా ను విడుదల చేస్తామంటూ కొందరు హామీ ఇస్తున్నారు.ఈ సంవత్సరానికి జల్సా మరియు తమ్ముడు సినిమా లతో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ను జరుపుకోవాలని అభిమానులకు అభిమాన సంఘం నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.







