బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో ఢీ డాన్స్ షోకి ఎంతో మంచి క్రేజ్ ఉందని చెప్పాలి ప్రస్తుతం ఈ కార్యక్రమం 14 వ సీజన్ ప్రసారమవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది.ఇకపోతే ఈ కార్యక్రమానికి ఎంతో మంది కొరియోగ్రాఫర్లు నటీమణులు జడ్జిలుగా వస్తూ వెళ్తున్నారు లేకపోతే తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే కంటెస్టెంట్ లో తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో దుమ్ము దులిపారు.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో భాగంగా ఓ కంటెస్టెంట్ అమ్మ సెంటిమెంటుతో అక్కడ ఉన్నటువంటి అందరిని పెద్ద ఎత్తున ఏడిపించారని చెప్పాలి.
అమ్మ సెంటిమెంట్ ఎక్కడున్న 100% వర్క్ అవుట్ అవుతుంది అనే విషయం మనకు తెలిసిందే.ఇలా అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
ఇలా ఢీ వేదికపై ఓ కంటెస్టెంట్ అమ్మ సెంటిమెంటుతో పర్ఫామెన్స్ చేసి అందరిని ఏడిపించారు.
ఈ ప్రోమోలో భాగంగా తన డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసిన అనంతరం పూర్ణ ఎంతో ఎమోషనల్ అవుతూ వేదిక పైకి వచ్చి ఒక్కసారిగా వెక్కివెక్కి ఏడ్చింది.మరొక జడ్జి శ్రద్ధాదాస్ సైతం గుండెలు పిండే ఆ పర్ఫామెన్స్ చూసిన ఆమె కన్నీటిని ధారలా పొంగించింది.ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు.
ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ కాగా ఈ పెర్ఫార్మెన్స్ కి సంబంధించిన పూర్తి డాన్స్ పెర్ఫార్మెన్స్ చూడాలంటే ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి