టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కెరియర్ రిస్క్ లో పడ్డదా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.ఆల్రెడీ డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు ఫ్లాప్ అవగా లేటెస్ట్ గా వచ్చిన లైగర్ కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజైన లైగర్ సినిమా ఫ్లాప్ అవడం విజయ్ దేవరకొండకి షాక్ ఇచ్చింది.పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో మాస్ యాక్షన్ మూవీగా లైగర్ వచ్చింది.
అయితే సినిమాలో హీరో క్యారక్టరైజేషన్ తప్ప కథ అంతా రొటీన్ గా ఉందని ఆడియెన్స్ తిప్పికొట్టారు.
హ్యాట్రిక్ ఫ్లాపులతో విజయ్ కెరియర్ డైలెమాలో పడ్డదని చెప్పొచ్చు.
ఈ క్రమంలో విజయ్ దేవరకొండ ఇక మీదట కథల విషయంలో చాలా జాగ్రత్త వహించాలని లేకపోతే ఆయన కెరియర్ రిస్క్ లో పడినట్టే అని చెప్పుకుంటున్నారు.అంతేకాదు విజయ్ దేవరకొండ ప్రతి సినిమాలో అర్జున్ రెడ్డి క్యారక్టర్ ని కొనసాగిస్తున్నట్టుగా ఉందని.
అది కూడా తను మార్చుకోవాలని అంటున్నారు.లైగర్ హిట్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ లైగర్ రిజల్ట్ విజయ్ దేవరకొండకి పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.








