ఈ నెల 25వ తేదీన విడుదలైన లైగర్ సినిమా భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలై ఆ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోవడం వల్ల ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన ఛార్మికి కూడా భారీ మొత్తంలో నష్టాలు తప్పవని చెప్పవచ్చు.
లైగర్ తో పాటు గతంలో పలు సినిమాలు కూడా ఛార్మీకి భారీగా షాకివ్వడం గమనార్హం.
మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ భూమిక తకిట తకిట అనే సినిమాను నిర్మించగా ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.
ఈ సినిమా ఫలితం తర్వాత భూమిక సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్నారు.మరో హీరోయిన్ కళ్యాణి కూడా భర్త డైరెక్షన్ లో తెరకెక్కిన పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి చేతులు కాల్చుకున్నారు.
హీరోయిన్లలో ఎక్కువమందికి సినిమా నిర్మాణం అచ్చిరాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సీనియర్ హీరోయిన్లు సావిత్రి, జయసుధ సైతం పలు సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరించి దెబ్బ తిన్నారు.

సాధారణంగా హీరోలతో పోల్చి చూస్తే హీరోయిన్ల పారితోషికం తక్కువనే సంగతి తెలిసిందే.హీరోయిన్లు తమ సినీ కెరీర్ లో సంపాదించిన మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి నష్టపోతున్నారు.హీరోయిన్లకు సినిమా నిర్మాణం కలిసిరాలేదనే చెప్పాలి.ఈ రీజన్స్ వల్లే పలువురు హీరోయిన్లు సినిమాల నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు.

కాజల్, తమన్నా నిర్మాతలుగా కెరీర్ ను మొదలుపెట్టనున్నారని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ తక్కువగా ఉండటంతో వాళ్లు సినిమాల నిర్మాణానికి దూరంగా ఉంటూ వస్తున్నారు.ఒక సినిమాను నిర్మించాలంటే ఆ నిర్మాత పడే కష్టాలు అన్నీఇన్నీ కావు.సరైన కథ, కథనాలను ఎంచుకోకపోవడం వల్లే హీరోయిన్లలో ఎక్కువమందికి నిర్మాతలుగా ఫ్లాపులు ఎదురవుతున్నాయి.







