బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రపై సందిగ్ధత నెలకొంది.పాదయాత్రపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ పోలీసులు సీజే బెంచ్ ను ఆశ్రయించారు.
పాదయాత్రలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని పోలీసులు రిట్ పిటిషన్ లో పేర్కొన్నారు.ఈ క్రమంలో పాదయాత్రను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
పోలీసుల రిట్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.అయితే, నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పునః ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతోంది.