బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నేడు పునః ప్రారంభంకానుంది.జనగామ జిల్లా జాఫర్ గఢ్ మండలం పాంనూర్ నుంచి పాదయాత్రను కొనసాగించనున్నారు.
ఈరోజు యాత్రలో భాగంగా పాంనూర్, ఉప్పుగల్, కూనూర్, గర్మెపల్లి, నాగపురంలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుంది.రేపు భద్రకాళీ ఆలయం వరకు కొనసాగిన అనంతరం పాదయాత్ర ముగింపు సభ ఉంటుంది.
అయితే, బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో నిలిపి వేయాలని పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో పాదయాత్రకు లైన్ క్లియర్ అయింది.







