రెండు తెలుగు రాష్ట్రాలలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు కాగా రీఎంట్రీలో కూడా వేగంగా సినిమాలలో నటిస్తూ చిరంజీవి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు.ఆచార్య సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాపై ఆ ప్రభావం ఏ మాత్రం పడలేదు.
యంగ్ జనరేషన్ స్టార్ డైరెక్టర్లతో పని చేస్తూ చిరంజీవి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు.
వయస్సుతో సంబంధం లేకుండా చిరంజీవిని అభిమానించే అభిమానులు ఉన్నారు.
రంగరంగ వైభవంగా సినిమాకు గిరీశయ్య దర్శకుడు కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.నాది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామం అని అప్పట్లో వీధి సినిమాలు వేస్తూ ఉండేవారని అలా దొంగ మొగుడు అనే సినిమా కూడా వీధి సినిమాగా ప్రదర్శితం అయిందని ఆయన చెప్పుకొచ్చారు.

మా పిల్లల బ్యాచ్ అందరికీ ఒక కాన్సెప్ట్ ఉండేదని చిరంజీవి గారి సినిమా ఏదైనా పడితే ఊరిలో ఏ చెట్టుకు పూలు ఉండకూడదని ఆయన తెలిపారు.పూలన్నీ కోసుకొచ్చి మూటలో పెట్టేసేవాళ్లమని ఆయన వెల్లడించారు.దొంగమొగుడు సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ అని సినిమా అంతా అయిపోయిన తర్వాత సినిమా చివర్లో మరో చిరంజీవి భానుప్రియకు పెయిర్ గా వస్తారని ఆ సమయంలో ప్రొజెక్షన్ ఆపేయడంతో మాకు ఇబ్బంది కలిగిందని ఆయన చెప్పుకొచ్చారు.

వాడితో మళ్లీ ప్రొజెక్షన్ వేయించి పూలు వేశామని ఆయన తెలిపారు.చిరంజీవిపై తనకు ఏ స్థాయిలో అభిమానం ఉందో గిరీశయ్య ఈ విధంగా చెప్పుకొచ్చారు.మరోవైపు రంగరంగ వైభవంగా సినిమా సెప్టెంబర్ నెల 2వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ ఖాతాలో సక్సెస్ చేరడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చిరంజీవి సినిమా సమయంలో ఏదైనా తక్కువగా జరిగితే గొడవలే అని ఆయన పరోక్షంగా కామెంట్లు చేయడం గమనార్హం.







