టాప్ లేపిన రియో.. ప్రకటనలు లేకుండానే ఇలా

పెర్ప్యూమ్ బ్రాండ్ రియా రికార్డులు క్రియేట్ చేస్తోంది.దేశంలోనే నెంబర్ వన్ పెర్ఫ్యూమ్ బ్రాండ్ గా నిలిచింది.పెర్ఫ్యూమ్ తో పాటు రూమ్ ఫ్రెషనర్లు, ఎయిర్ ఫ్రెషనర్లు, డియోడరెంట్ లను కూడా రియా బ్రాండ్ ఉత్పత్తి చేస్తోంది.2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.80 కోట్ల టర్నవర్ సాధించినట్లు రియా సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదిత్య విక్రమ్ డాగా తెలిపారు.నీల్సన్ ఐక్యు తాజాగా రేటింట్స్ విడుదల చేసింది.

 Top Raised Rio Without Ads Like This , Reyo, New Record, Latest News, Viral Lat-TeluguStop.com

ఈ రేటింగ్స్ ప్రకారం రియా సంస్థ మిగతా పెర్ప్యూమ్ బ్రాండ్స్ కంటే అత్యధిక టర్నోవర్ సాధించింది.ఇండియాలోని పెర్ఫ్యూమ్ మార్కెట్ లో రియా 10.8 శాతం వాటా సొంతం చేసుకున్నట్లు నీల్సన్ ఐక్యు సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది.2025 నాటికి రియా సంస్థ మార్కెట్ 20 శాతానికి పెరగవచ్చని అంచనా వేసింది.రియా బ్రాండ్ పెర్ప్యూమ్ ప్రస్తుతం ఆప్ లైన్ లో మాత్రమే లభిస్తుంది.ప్రముఖ ఫ్లాట్ ఫామ్స్ లో రిటైర్లు పరోక్షంగా విక్రయిస్తున్నారు.

ఇక నీల్సన్ ఐక్యు నివేదిక ప్రకారం.దేశంలో పెర్ప్యూమ్ బిజినెస్ గత ఏడాది ఈ కామర్స్ మినహా రూ.709 కోట్లు జరిగినట్లు తేలింది.2025 నాటికి ఈ-కామర్స్ బిజినెస్ తో కలుపుకుని రూ.1200 కోట్లకు చేరుకునే అవకాశముందని అంచనా వేసింది.రియా బ్రాండ్ విషయానికొస్తే.1997లో కోల్ కతాలో ప్రారంభమైంది.లక్ష రూపాయల పెట్టుబడితో ఆదిత్య తండ్రి ఎన్ కేడాగా ప్రారంభించారు.

కోల్ కతా నుంచి ఢిల్లీలోని సదర్ బజార్ కు మార్చారు.ఆ తర్వాత కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లో స్టార్ట్ చేశారు.ప్రారంభించిన మూడేళ్లలోనే సంస్ధ ఆదాయం రూ.5 కోట్లకు చేరుకుంది.అయితే రియా ఎలాంటి కమర్షియల్ యాడ్స్ ఇప్పటికీ ఇవ్వలేదు.యాడ్స్ కోసం ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదు.అసలు యాడ్స్ ఇవ్వకుండా ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం జరగడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube