సోషల్ మీడియా పరిధి పెరుగుతున్నవేళ అనేక రకాల వీడియోలు నిత్యం మన స్మార్ట్ ఫోన్లలో తారసపడుతూ ఉంటాయి.అయితే అందులో కొన్ని మాత్రం మనల్ని ఇట్టే కట్టి పడేస్తాయి.
ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఈమధ్య ఎక్కువగా వైరల్ అవడం మనం చూస్తూనే వున్నాం.మరీ ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంబంధించిన ఫుటేజ్ అయితే ఆహుతులను అలరించడంలో ముందుంటుందని చెప్పుకోవాలి.
ఆ కోవకు చెందిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో తన ఉనికి చాటుకుంటోంది.
ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో కుక్క పడుతోన్న కష్టం చూస్తే నవ్వకుండా ఉండలేరు.
అలాగే దాని నిబద్ధతకు మనుషులమైన మనం ఖచ్చితంగా సిగ్గు తెచ్చుకోవాలి.ఎందుకంటే మనలో అనేకమందికి వ్యాయామం అంటే ఏమిటో తెలియదు.
వ్యాయామం చేస్తే ఎలాంటి రోగం దరిచేరదు అని చెప్పినా కూడా మనల్ని బద్ధకం ఆవహిస్తుంది.కానీ ఈ శునకం వ్యాయామం చేయడానికి పడే కష్టాలు చూస్తే మంచి స్ఫూర్తిగా అనిపిస్తుంది.అవును… ఈ పెంపుడు కుక్క టీవీ చూస్తూ వ్యాయామం చేస్తూ కనిపిస్తుంది.

ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో కలిసి వ్యాయామం చేయడాన్ని వీడియోలో మనం గమనించవచ్చు.ఇక ఆ దృశ్యాన్ని ఈ కుక్క టీవీలో తిలకిస్తూ… అతనిని కాపీ చేస్తూ.వ్యాయామం చేయడం ప్రారంభించింది.
ఆ వీడియోలో కుక్క ఉండటం బాగా దీనికి నచ్చినట్టుంది.అచ్చం దానిలాగే వ్యాయామం చేస్తోంది.
కొన్నిసార్లు నిలబడి, కొన్నిసార్లు పడుకుని వ్యాయామం చేస్తోంది.కుక్కలను కేవలం విశ్వాసం గల జంతువులు మాత్రమే కాదని.
తెలివైన జంతువులని ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది.నెటిజన్లు దీనిని విపరీతంగా లైక్ చేస్తున్నారు.







