బుల్లితెర చానల్స్ అన్నింటిలోకి ఈటీవీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాలి.ఈటీవీ ప్రారంభించి 27 సంవత్సరాలు పూర్తి కావడంతో పెద్ద ఎత్తున ఈ టీవీ 27వ వార్షికోత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈటీవీ ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను, సీరియల్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసేది.ఈ విధంగా గత 27 సంవత్సరాల నుంచి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈటీవీ 27వ వార్షికోత్సవ సందర్భంగా భలే మంచి రోజు అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ కమెడియన్లతో పాటు ఎంతోమంది బుల్లితెర నటీనటులు హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమానికి పోసాని కృష్ణ మురళి, ఇంద్రజ వంటి వారు కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బుల్లితెర నటి హరిత మాట్లాడుతూ ఈటీవీ తనకు జీవితాన్నిచ్చిందని, తనకు ఈటీవీ పెళ్లి కూడా చేసిందని ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.ఇకపోతే పోసాని కృష్ణ మురళి ఎప్పటికప్పుడు తనదైన శైలిలో పంచులు వేస్తూ అందరిని నవ్వించారు.

ఈ క్రమంలోనే పోసాని హైపర్ ఆదీని ఓ ఆట ఆడుకున్నారు.ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ హైపర్ ఆది నీ ఫోన్లో ఎంతమంది అమ్మాయిల ఫోన్ నెంబర్లు ఉన్నాయి అంటూ అడిగారు.ఈ విధంగా పోసాని అడిగేసరికి ఆది ఒక్కసారిగా తెల్ల మొహం వేశాడు.అయితే వెంటనే ఇంద్రజ కల్పించుకొని ఆది గారిని అలా అడగకూడదు ఎందుకంటే ఆయన ఫోన్ లో ఉండేవన్ని అమ్మాయిల నెంబర్ లే ఎంతమంది అబ్బాయిల నెంబర్లు ఉన్నాయని అడగాలి ఆయన వాట్సాప్ లో కూడా అన్ని అమ్మాయిల ఫోన్ నెంబర్లు ఉంటాయి అంటూ దారుణంగా ఇంద్రజ హైపర్ ఆది పరువు తీసింది.
మొత్తానికి ఇంద్రజ ఇలా అనేసరికి ఆది ఒక్కసారిగా తెల్ల మొహం వేసుకున్నారు.







