చేరికలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ? కొత్త కమిటీ ఏర్పాటు ?

జనసేన విషయంలో పవన్ కళ్యాణ్ మొదట్లో నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించినట్టుగా కనిపించినా,  ఇప్పుడిప్పుడే పార్టీని ఒక గాడిలో పెట్టేందుకు అధికారానికి దగ్గర చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని ఊహించిన దానికంటే బలంగా ముందుకు తీసుకువెళ్లడంలో పవన్ సక్సెస్ అయ్యారు.2019 ఎన్నికల ఫలితాలు తర్వాత జనసేన పూర్తిగా కనుమరుగవుతుందని బిజెపిలో విలీనం అవుతుందని అంత అంచనా వేసినా,  పవన్ మాత్రం మొండిగానే పార్టీని ముందుకు తీసుకువెళ్లారు.పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు బయటకు వెళ్లిపోయినా,  పవన్ మాత్రం తన అభిమానులు,  కార్యకర్తలను నమ్ముకుని ముందుకు వెళుతున్నారు.

 Pawan Green Signal For Inclusion? Formation Of A New Committee, Janasena, Pawan-TeluguStop.com

2024 ఎన్నికల నాటికి జనసేన మరింత బలోపేతం చేసి  ఎన్నికలు ఫలితాలు అనంతరం ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న తమ మద్దతు తప్పకుండా అవసరం అవుతుంది అనే నమ్మకంలో పవన్ ఉన్నారు.అప్పుడు కింగ్ మేకర్ గా మారవచ్చనే లెక్కల్లో ఆయన ఉన్నారు.అయితే ఇదంతా జరగాలంటే పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండాలనే విషయాన్ని ఇప్పుడు గుర్తించారు.వాస్తవంగా జనసేన ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు చూసుకుంటే చేరికలపై పెద్దగా ఫోకస్ చేయలేదు ఎవరికి వారు సొంతంగా పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నించడం తప్ప పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించిన సందర్భాలు అతి తక్కువగా ఉన్నాయి.
  ఇదే సమయంలో పార్టీలో చేరిన కీలక నాయకులు అనుకున్న వారు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వెళ్ళిపోతుండడంతో జనసేనలో ఏదో జరుగుతోందనే భయం నాయకుల్లో ఏర్పడడంతో వలసలు అంతంత మాత్రమే అనే అభిప్రాయం అందరిలోనూ వచ్చాయి.

ఏపీలో టీడీపీ బలహీనం కావడంతో జనసేనకు మంచి ఛాన్స్ వచ్చినట్టు అయింది.అధికార పార్టీ వైసీపీపై రాజీ లేకుండా పోరాడుతూ, పవన్ తన రాజకీయ ప్రసంగాలు ఉండేలా చూసుకుంటున్నారు.

ఇక పార్టీలో కోవర్టులు ఉన్నారని సంచలన ప్రకటనలు చేశారు.వారంతా స్వచ్ఛందంగా బయటకు వెళ్ళిపోవాలని హెచ్చరించారు.

ఇక పెద్ద ఎత్తున ఇతర పార్టీలోని నాయకులను జనసేనలోకి ప్రోత్సహించడమే లక్ష్యంగా పవన్ ముందుకు వెళ్ళబోతున్నారు.అది కూడా క్లీన్ ఇమేజ్ ఉన్న వారిని పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహం సిద్ధం చేశారు.

Telugu Ap, Jagan, Janasena, Janasenani, Pawan Kalyan, Ysrcp-Politics

  దీనిలో భాగంగానే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమశిక్షణ సంఘం ఏర్పాటుకు ప్రధాన కారణం చేరికలేనని తెలుస్తోంది.పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటే జనసేన లో ఊపు వస్తుందని పవన్ నమ్ముతూ ఉండడం తో కొంతమంది కీలక నాయకులు సూచన మేరకు క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.వాస్తవంగా ఇప్పుడు క్రమశిక్షణ సంఘం ఏర్పాటు జనసేనకు అవసరం లేకపోయినా, ముందు ముందు చేరికలు ఊపందుకుంటే అప్పుడు తప్పకుండా అవసరం అవుతుందని ఉద్దేశంతో ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక చేరికలతో జనసేనలు జోష్ కనిపించబోతుందనే సందడి ఆ పార్టీ కార్యకర్తలు పవన్ అభిమానుల్లో కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube