అధికార పార్టీ సర్వేలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగా పడిపోయిందని కనీసం 75 మందిని మార్చాలని పీకే సూచిస్తే 60 మందిని సాగనంపాలని సీఎం జగన్ నిర్ణయానికి వచ్చినట్లు జోరుగా ప్రచారం కొనసాగుతుంది.
ఆయా చోట్ల అదనపు ఇన్చార్జిల నియామకం ఎమ్మెల్యేలు మరింత గుబులు రేపుతుంది.ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు ఏకంగా ఆందోళనకే దిగుతున్నారు.
ఈ పరిస్థితుల్లో టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తే వైసిపి ఓడిపోవడం ఖాయమన్న విశేషకులు ప్రభుత్వ పెద్దలను ఇంకా కలవరపెడుతున్నాయి.
ఏపీ రాష్ట్రంలో చాలామంది వైసిపి ఎమ్మెల్యేలు ఆభద్రతా భావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
ఓవైపు ముఖ్యమంత్రి జగన్ గ్రాఫ్ పడిపోతుందని సర్వేలు చెబుతున్నాయని వారు అంటుండగా దానిని మరుగుపరచి ఎమ్మెల్యేల గ్రాఫ్ క్షీణిస్తుందని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేస్తున్నారు.తన సొంత సర్వేలు ఐ ప్యాక్, మరో ఢిల్లీ సంస్థ సర్వేలు.రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విశ్లేషణల ఆధారంగా పలువురు ఎమ్మెల్యేలకు 2024 ఎన్నికల్లో టికెట్లు ఇవ్వరాదని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి.175 అసెంబ్లీ స్థానాల్లో వైసిపి పార్టీకి ప్రస్తుతం 151 సీట్లు ఉన్నాయి.వీటిలో 75 స్థానాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని వారు గెలవడం కష్టమని వారిని మార్చేయాలని పీకే సూచించగా సొంత సర్వేల ఆధారంగా కనీసం 58,60 మందిపై వేటు వేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం.

లోక్ సభ నియోజకవర్గాల్లో వైసిపి ఎంపీలపై భారీ ప్రతికూలత ఉందంటూ సర్వేలో తేలినట్లు సమాచారం.కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న యువసేనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని చెబుతున్నారు.నర్సాపురంలో ఎంపీ రఘురామరాజు స్థానంలో ఎటు తిరిగి కొత్త అభ్యర్థిని తీసుకోబోతున్నారు.
సర్వే ఫలితాల ఆధారంగా అధిష్టానం భారీగా అభ్యర్థులను మార్చబోతుందని తమ నియోజకవర్గాలకు అదనపు ఇన్చార్జిలను నియమించనుందన్న వార్తలు వైసిపి ఎమ్మెల్యేలను కుదిపేస్తున్నాయి.ఇప్పటికే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉండగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యం వరప్రసాద్ను సమన్వయకర్తగా నియమించడంతో గడిచిన నాలుగు రోజులుగా ఎమ్మెల్యేల వర్గీయులు ఆందోళన నిర్వహిస్తున్నారు.
మాజీమంత్రి సుచరిత ఇంటిముందు ధర్నా కూడా చేశారు.ఇది చూశాక మిగతా ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారోనని వైసిపి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.