హీరోయిన్ కోమలీ ప్రసాద్ బర్త్ డే సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన 'శశివదనే' టీమ్

గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి.

 Komalee First Look From Sasivadane Movie, Komalee First Look ,sasivadane Movie,-TeluguStop.com

భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా మరియు RX 100 రాంకీ,సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్ నటీనటులుగా సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం లో అహితేజ బెల్లంకొండ నిర్మాణ సారద్యంలో గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘శశివదనే’. ఈ రోజు చిత్ర హీరోయిన్ కోమలి ప్రసాద్ బర్త్ డే ను పురస్కరించు కొని చిత్ర యూనిట్ విడుదల చేసిన “శశివదనే” ఫస్ట్ లుక్ తో అందరినీ కట్టి పడేస్తుంది.

ఈ ఫస్ట్ లుక్ విడుదలైన గంటల వ్యవదిలోనే పరిశ్రమ నుండి ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం విశేషం.ఈ సందర్బంగా చిత్ర నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ.

మా చిత్ర హీరోయిన్ కోమలీ ప్రసాద్ బర్త్ డే సందర్బంగా మా చిత్ర యూనిట్ తరుపున తనకు బర్త్ డే విషెస్ తెలుపు తున్నాము.‘పలాస 1978’ సినిమాతో చలచిత్ర పరిశ్రమ ప్రముఖులను, ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి చాలా చక్కని నటనను కనపరచ్చాడు.

హీరోయిన్ కోమలీ ప్రసాద్ కూడా చాలా చక్కగా నటించింది.ఈ చిత్రంలో పని చేసిన నటీ నటులు అందరూ పోటీ పడి నటించారు.చిత్ర దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామా గా తయారు చేసుకున్న ‘శశివదనే’ చిత్రాన్ని చాలా చక్కగా గ్రాండియ‌ర్‌గా, హై స్టాండ‌ర్డ్స్‌లో తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్ పై సాగే లవ్ సీన్స్ చాలా కొత్తగా యూనిక్‌గా ఉంటాయి.

ఈ చిత్రానికి మ్యూజిక్, విజువల్స్ హైలైట్ గా నిలుస్తాయి.ఇందులో ఉన్న ఐదు పాటలు అద్భుతంగా వచ్చాయి.

ఇప్పటి వరకు తీసిన సన్నివేశాలు చూసుకున్నాం చాలా బాగా వచ్చాయి.మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం.

ఇండస్ట్రీ లో ప్రస్తుతం షూటింగ్ నిలిపి వేత కారణంగా ఈ చిత్రం కూడా షూటింగ్ నిలుపుదల చేయడం జరిగింది.సెప్టెంబర్ 1 నుండి షూటింగ్స్ ప్రారంభం అవుతున్న సందర్బంగా ఈ చిత్రానికి సంబంధించి మిగిలి వున్న 10 రోజుల షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాము అన్నారు.

నటీ నటులు

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్, RX 100 రాంకీ,సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్ తదితరులు.

సాంకేతిక నిపుణులు

పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎడిటర్: గ్యారీ బీహెచ్, కలరిస్ట్: ఎ.అరుణ్ కుమార్ (డెక్కన్ డ్రీమ్స్), సీఈవో: ఆశిష్ పెరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీపాల్ చొల్లేటి, ఛాయాగ్రహణం: సాయికుమార్ దార, సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ, కరుణాకర్ అడిగర్ల, సంగీతం: శరవణ వాసుదేవన్, కాస్ట్యూమ్స్ – సమర్పణ: గౌరీ నాయుడు, నిర్మాత: అహితేజ బెల్లంకొండ, రచన – దర్శకత్వం: సాయిమోహన్ ఉబ్బన

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube