ఏంటి? NTR డైలాగ్ ఆనంద్ మహీంద్రా చెప్పడమేంటని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.భారత టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా పరిచయం అక్కర్లేదేమో.
ఆయన తన ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంత బిజీగా వుంటారో సోషల్ మీడియాలో కూడా అంతే బిజీగా వుంటారు ఈ బిజినెస్ మ్యాన్.ముఖ్యంగా కొత్త కొత్త ఐడియాలు ఎవరు చేసినా వారిని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు ఆనంద్ మహీంద్రా.
అలాగే ఎక్కడ పొరపాట్లు జరిగినా నిర్భయంగా వేలెత్తి ప్రశ్నిస్తారు ఈ దిగ్గజం.
తాజాగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఓ అరాచకం గురించి తనదైన రీతిలో ఆనంద్ మహీంద్రా ఓ పోస్టు పెట్టారు.
పర్యావరణ సమతుల్యానికి కారణమైన చెట్లను ప్రజలు విపరీతంగా నరికివేస్తున్నారు.అందువలన నానాటికీ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుందనే విషయం అందరికీ తెలిసినదే.ఈ నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది.సదరు వీడియోలో నలుగురు ఓ భారీ పొడవైన చెట్టు నరికేస్తారు.
అందులో ఓ వ్యక్తి నరికిన ఆ చెట్టును కింద పడేసే ప్రయత్నం చేయగా.అది కాస్తా ఒరిగి చెట్టును నరికిన వ్యక్తిని పైకి ఎత్తి అవతల పడేస‍్తుంది.

దానిని ఆనంద్ మహీంద్రా ఉటంకిస్తూ… ‘మీరు చెట్టును నరికేయగలరు.కానీ దానిని కింద పడేయలేరు!’ అంటూ ఓ క్యాప్షన్‌ను జత చేస్తూ ట్వీట్‌లో పేర్కొన్నారు.ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను విపతీరంగా ఆకట్టుకుటుంది.ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.మరికొందరు ఈ వీడియోని రీట్వీట్ చేస్తున్నారు.ప్రకృతికి కోపం వస్తే ఇలాగే ఉంటుందంటూ చిన్నాభిన్నమైన రోడ్ల వీడియోల్ని షేర్లు చేస్తున్నారు.
అలాగే కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ అయితే ఎన్టీఆర్ నటించిన ‘జనతాగ్యారేజ్’ సినిమాలోని డైలాగులు షేర్ చేస్తున్నారు.







