హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట విషాదం నెలకొంది.ఆయన తండ్రి మల్లయ్య అనారోగ్యంతో రాత్రి కన్నుమూశారు.
దీంతో స్వగ్రామం కమలాపూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ క్రమంలో కమలాపూర్ కు చేరుకున్న ఈటల తండ్రి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
పితృవియోగంపై ఈటలను పలువురు నేతలు పరామర్శిస్తున్నారు.అయితే, కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్య హైదరాబాద్ లోని ఆర్వీఎం ఆస్ప్రతిలో చికిత్స పొందుతూ మరణించారు.







