టీఆర్ఎస్ నేత, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పై అట్రాసిటీ కేసు నమోదైంది.ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీతో పాటూ 120బీ, 384, 406, 420 తదితర సెక్షన్ల కింద ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ లో ఈనెల 20న కేసు నమోదైంది.
ఓ భూమికి సంబంధించిన వ్యవహారంలో తనను మోసం చేశారని ఆరోపిస్తూ.బోడుప్పల్ కు చెందిన మురళీ అనే వ్యక్తి ఎల్బీనగర్ లోని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం బొంతు రామ్మోహన్ తో పాటు తిరుపతి రెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.







