‘భారత్ జోడో యాత్ర’ పేరిట కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీకి కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు.సెప్టెంబర్ 7వ తారీకున తమిళనాడులో మొదలుకానున్న ఈ పాదయాత్ర దేశవ్యాప్తంగా 150 రోజులపాటు 3500 కిలోమీటర్లకు పైగా సాగనుంది.
కేరళలో 19 రోజులు కర్ణాటకలో 21 రోజులపాటు పాదయాత్ర చేపట్టే రాహుల్ గాంధీ తెలంగాణలో 12 రోజులు పాటు పాదయాత్ర చేయనున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల మీదుగా సుమారు 300 నుండి 350 కిలోమీటర్ల తెలంగాణలో రాహుల్ పాదయాత్ర చేయనున్నారు.
ఆ తర్వాత మహారాష్ట్ర లోకి వెళ్లేలా రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్ తయారు చేయడం జరిగింది.ప్రస్తుతం సోనియాగాంధీ వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో ఆమెకు తోడుగా.
రాహుల్ గాంధీ తో పాటు ప్రియాంక గాంధీ వెళ్తున్నారు.ఆ తర్వాత సెప్టెంబర్ 4వ తారీఖు ఢిల్లీలో జరగబోయే‘మెహంగాయ్ పర్ హల్లా బోల్’ ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు.







