సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఒక ప్లాప్ సినిమా తర్వాత ఇప్పుడు లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.కానీ ఈయన ప్లాప్ సినిమా తర్వాత వస్తున్నాడు అని ఎవ్వరికి అనిపించడం లేదు.
అప్పటికి ఇప్పటికి విజయ్ రేంజ్ చాలా మారిపోయింది.ఈయన పాన్ ఇండియా చేయకముందే ఆ రేంజ్ లో స్టార్ డమ్ వచ్చింది.
విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లైగర్’.రౌడీ స్టార్ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఇక మేకర్స్ సైతం వరుస ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమాపై మరింత ఆసక్తి చూపిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా తాజాగా ప్రొమోషన్స్ లో భాగంగా లైగర్ ను ఒక ప్రశ్న అడిగారు.
ఈ సినిమా ప్లాప్ అయితే మీ రియాక్షన్ ఏంటి అని.అందుకు విజయ్.”కొన్నేళ్ల క్రితం ఇదే ప్రశ్న మీరు అడిగి ఉంటే నాకు వెంటనే కోపం వచ్చేది.ఆ కోపంతోనే నేను మీకు సమాధానం చెప్పేవాడిని.
కానీ గత కొన్ని రోజులుగా నేను అందుకుంటున్న ప్రేమ వల్ల ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కోపం వస్తే ఆ ప్రేమను నేను కలదన్నినట్టే” అంటూ చెప్పుకొచ్చాడు.ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వడం ఖాయం అని తెలిపారు.
మరి రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఏ రికార్డులను క్రియేట్ చేస్తుందో అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఆగష్టు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.

సోలోగా రాబోతున్న ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా భారీగానే వచ్చే అవకాశం ఉంది.ఇక ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.







