ఊడిన వాహనం టైరు, పల్టీ కొట్టిన కారు.. వీడియో వైరల్!

రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎటు నుండి వస్తాయో చెప్పలేం.ఏ క్షణాన ఏ మూల నుండి ప్రమాదం పొంచి ఉంటుందో ఊహించడం చాలా కష్టం.

 Car Flips Over Highway After Tire Obstructs Details, Car Accident Latest Video,-TeluguStop.com

మనం రోడ్డుపై సక్రంగా వెళ్లినా.ఎదుటి వారు ఎలా వస్తారో అనే దానిపై రోడ్డు ప్రమాదాలు ఆధారపడి ఉంటాయి.

మనం మన దారిలో అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించిన తక్కువ వేగంతో వెళ్తున్నా.ఎదుటి వారి నిర్లక్ష్యపు డ్రైవింగ్, నిబంధనల ఉల్లంఘన మన ప్రాణాల మీదకు తీసుకువస్తుంది.

ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అచ్చంగా అలాంటిదే.ఏ సంబంధంలేని వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న మరో వ్యక్తి నిర్లక్ష్యానికి బలి అయ్యాడు.ఇక్కడ రాత్రి వేళ రోడ్డుపై వాహనాలు వెళ్తుంటాయి.ఉన్నట్టుండి ఓ వాహనానికి సంబంధించిన టైరు ఊడి రోడ్డుపై దొర్లుతూ వచ్చింది.ఆ సమయంలోనే అటు నుండి వస్తున్న ఓ ట్రక్.రోడ్డుపై వస్తున్న టైరును గమనించి చాక చక్యంగా తప్పించు కుంటుంది.

అయితే దాని వెనకాలే ఉన్న బ్లూ కలర్ ఎస్ యూవీ వాహనం మాత్రం టైరును ఢీకొట్టింది.ఊడిపోయిన టైర్ బ్లూ కలర్ ఎస్ యూవీ కిందకు వెళ్లడంతో ఆ వాహనం కాస్త గాలిలోకి లేచి పల్టీ కొట్టింది.

ఈ ఘటన 2021వ సంవత్సరం మే 17వ తేదీన జరిగింది.అయితే ఈ వీడియోను ఓ యూజర్ రెడ్డిట్ లో పోస్టు చేయడంతో మరో సారి వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube