నిఖిల్ హీరోగా చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన కార్తికేయ2 సినిమా బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తూ ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్న సంగతి తెలిసిందే.హిందీలో కూడా ఈ సినిమా కలెక్షన్లు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
మొదట కేవలం 50 షోలతో కార్తికేయ2 ప్రదర్శితం కాగా రోజురోజుకు ఈ సినిమాకు సంబంధించిన షోలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే హిందీలో ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడంతో ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
ఫుల్ రన్ లో హిందీలో రాధేశ్యామ్ సాధించిన కలెక్షన్లను కార్తికేయ2 బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.అదే జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ మరింత ఫీలయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
రాధేశ్యామ్ సినిమా ప్రభాస్ కెరీర్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందనే సంగతి తెలిసిందే.

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఫెయిలైంది.కార్తికేయ2 హిందీలో ఇప్పటికే 15 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది.హిందీలో వీక్ డేస్ లో కూడా ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తుండటం గమనార్హం.కార్తికేయ2 సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచింది.సినిమాసినిమాకు నిఖిల్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.కార్తికేయ2 సినిమా సక్సెస్ తో నిఖిల్ రేంజ్, మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది.నిఖిల్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
నిఖిల్ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.నిఖిల్ ప్రస్తుతం ప్రాజెక్ట్ ల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
తన రేంజ్ ను పెంచే ప్రాజెక్ట్ లకు మాత్రమే నిఖిల్ ఓటేస్తుండటం గమనార్హం.







