రాజధాని కేసులపై ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.రాజధానికి సంబంధించి ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ ను దాఖలు చేసింది.
అయితే రాజధానిలో ఎటువంటి పనులు చేపట్టలేదని, పురోగతి కూడా లేదని రైతుల తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో సుప్రీంలో ఎస్ఎల్ పీ వేశారా అని న్యాయస్థానం ప్రశ్నించగా.
రైతుల పరిహారానికి సంబంధించి తిరస్కరించడంతో దానిపై మాత్రమే ఎస్ఎల్పీ వేశామని లాయర్ తెలిపారు.హైకోర్టు తీర్పును మాత్రం వ్యతిరేకించలేదని పేర్కొన్నారు.
సుప్రీం ధర్మాసనంలో ఎస్ఎల్పీ పెండింగ్ లో ఉన్న సమయంలో హైకోర్టులో విచారణ సబబా అని న్యాయస్థానం ప్రశ్నించింది.మరోవైపు హైకోర్టు తీర్పులో తమకు కావాల్సిన అంశాలను తిరస్కరించడంతో.
వాటిపై మాత్రమే సుప్రీంకోర్టుకు వెళ్లామని రైతుల తరపు న్యాయవాది వెల్లడించారు.ప్రభుత్వం సకాలంలో తీర్పును అమలు చేయకపోవడంతో.
హైకోర్టులోనే కోర్టు ధిక్కార పిల్ ను వేశామన్నారు.అయితే ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ ఇవ్వడంతో ఆ నివేదికపై కౌంటర్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
అనంతరం రాజధాని కేసులపై విచారణను అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.







