భారత 75వ స్వాంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.భారత్‌తో పాటు చాలా దేశాల్లో భారతీయులు, పలువురు విదేశీయులు కూడా వేడుకల్లో పాల్గొని త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు.
ముఖ్యంగా ఈసారి చెప్పుకోవాల్సింది అమెరికా గురించే.గతంలోనూ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అగ్రరాజ్యంలో జరిగాయి.
అయితే భారత రాయబార కార్యాలయం, కాన్సులేట్ ఆఫీసులు, మరికొన్ని చోట్ల మాత్రమే జరిగేవి.కానీ ఈసారి మాత్రం భారత్‌తో సరిసమానంగా అక్కడా ఏర్పాట్లు జరిగాయి.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్, హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాలకు అమెరికాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇకపోతే.
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భారతదేశం పట్ల పెరుగుతున్న ప్రజాదరణకు సంకేతంగా కాలిఫోర్నియాలోని ఒక చిన్న నగరంలో తొలిసారిగా భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో ప్లీజంటన్ నగర మేయర్ కర్లా బ్రౌన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్ గ్రహీత, డిఅంజా కమ్యూనిటీ కళాశాలలో హిందీ ప్రొఫెసర్ అయిన నిలూ గుప్తా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.బే ఏరియా ప్రాంతంలో హిందీ, భారతీయ సంస్కృతిని ప్రోత్సహించినందుకు గాను ఆమె 2021లో అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా మేయర్ కర్లా బ్రౌన్ మాట్లాడుతూ.నగరంలోని విభిన్న సంస్కృతుల వేడుకలకు ఇది నాంది పలుకుతుందని బ్రౌన్ ఆశాభావం వ్యక్తం చేశారు.విభిన్న సంస్కృతుల గురించి తెలుసుకున్నప్పుడు స్నేహితులు, పొరుగువారిగా ఏకమవుతామని ఆయన అన్నారు.ఒక సంఘంగా భారత్‌కి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ఇండియా సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటామని బ్రౌన్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వీణా పూరి మాట్లాడుతూ.తన తండ్రి సత్యపాల్ మెహతా తొలి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో జవహర్‌లాల్ నెహ్రూతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారని ఆమె గుర్తుచేసుకున్నారు.







