ఓటీటీలు షాకింగ్ ప్లాన్.. ఇక ప్రేక్షకులకి తీవ్ర నిరాశే!

ఈ రోజుల్లో ఎవరూ కూడా థియేటర్ల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.సినిమా చాలా గొప్పగా ఉంటే తప్ప థియేటర్లకు వచ్చి డబ్బులు ఖర్చు చేయడానికి సగటు ప్రేక్షకుడు ఆసక్తి చూపడం లేదు.

 Ott Platforms Shocking Decision Regarding Movies Digital Streaming Details, Ott-TeluguStop.com

ఓటీటీలోనే హాయిగా సినిమాలు చూసేస్తున్నారు.ఈ క్రమంలో సినీ నిర్మాతలు థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేందుకు ఓటీటీలపై చాలా ఆంక్షలు విధిస్తున్నారు.

థియేటర్లో రిలీజ్ కాకముందే సినిమాలను కొనకూడదని రూల్స్ పెడుతున్నారు.కనీసం ఎనిమిది వారాల తర్వాత సినిమా రిలీజ్ చేయాలంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఓటీటీలు కూడా తమదైన నిబంధనలతో అందరికీ షాక్ ఇస్తున్నాయి.థియేటర్లలో విడుదలయిన తర్వాతే ఏ సినిమా అయినా కొనుగోలు చేసేలా కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పటికే ఈ రూల్ అమల్లోకి తెచ్చింది.ఈ సంస్థ ఏ సినిమాను కూడా నేరుగా కొనుగోలు చేయడం లేదు.థియేటర్లలో విడుదల అయినవే తీసుకుంటోంది.అంతేకాదు సెన్సార్ సర్టిఫికేట్ బుక్ మై షో బుకింగ్స్, ఇంగ్లిష్ వెబ్ సైట్ల రివ్యూలు ఉన్నవాటిని మాత్రమే కొనుగోలు చేస్తోంది.

నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, సోనీ లివ్ సంస్థలు కూడా త్వరలోనే ఇదే బాట పట్టనున్నాయి.

Telugu Disney Hot, Netflix, Ott, Ott Platms, Prime, Sonyliv, Ups-Latest News - T

థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు తీసుకోవడంతోపాటు వాటి ధరలను కూడా కొత్తగా నిర్ణయించుకున్నాయి.థియేటర్లలో బాగా ఆడిన సినిమాలకు మాత్రమే ఎక్కువ డబ్బులు ఆఫర్ చేయాలని భావిస్తున్నాయి.అంటే అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు చీప్ ధరకే అమ్ముడుపోతాయి.

కొత్త సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ కాకపోతే ప్రేక్షకులు చాలా రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది.అలాగే ఓటీటీలు చాలా తక్కువ సినిమాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ తగ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube