కారు కొనాలనే కల ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది.సరిపడా డబ్బులు జమ చేసుకున్న తర్వాత ఎవరైనా సరే వెంటనే కారు కొనుగోలు చేస్తారు.
కానీ సింగపూర్ ప్రజలకు మాత్రం అది సాధ్యం కాదు.ఎందుకంటే ఇక్కడ కారు కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.
అంతేకాదు పార్కింగ్ స్థలం ఉందా? అనేది కూడా అధికారులు వచ్చి చెక్ చేస్తారు.ఒక కారు కొనుగోలు చేసి దానిని రోడ్లపైకి తిప్పేముందు చాలా నిబంధనలను దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది.
ఇలాంటి రూల్స్ ఏ దేశంలో కూడా కనిపించవు.మరి ఇక్కడే ఎందుకు అనే కదా మీ సందేహం.
అయితే ఈ కథనం చదవాల్సిందే.
సింగపూర్ చాలా చిన్న దేశం.
ఈ దేశంలో చాలా వరకు రోడ్లు వేశారు.అయితే అక్కడ జనాభా చాలా అధికంగా ఉన్నారు.
విదేశీయులు కూడా వేల సంఖ్యలో రోజు సింగపూర్ కి రాకపోకలు చేస్తుంటారు.కాబట్టి రోడ్లన్నీ కూడా ఎప్పుడూ కిక్కిరిస్తుంటాయి.
ఇక వాహనాలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల ట్రాఫిక్ అనేది చాలా అధికంగా ఉంటుంది.కారు పార్క్ చేసుకోవడానికి తగినంత స్థలం కూడా ఉండదు అక్కడ.
ఈ దేశంలో ట్రాఫిక్ చాలా ఎక్కువ కాగా అక్కడ నివసించే జనాభా కార్లను అధికంగా కొనుగోలు చేస్తే ఇబ్బందులు తప్పవు.అవన్నీ రోడ్ల మీదకు వస్తే ట్రాఫిక్ అనేది పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది.
అందుకే అక్కడి ప్రభుత్వం ఎవరూ కూడా సొంత వాహనాలు కొనుగోలు చేయలేనంత కఠినమైన నిబంధనలు తీసుకొచ్చింది.
సొంత వాహనాలను కొనాలి అంటే అక్కడ ఒక అర్హత సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది.
కారు ధర బట్టి ఈ సర్టిఫికెట్ ఖరీదు లక్షల్లో ఉంటుంది.అందువల్ల ఎవరూ కూడా కారు కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించరు.
ఇదే సమయంలో ప్రజా వాహనాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుంది.అప్పుడు ప్రభుత్వానికి లాభం వస్తుంది.
ప్రభుత్వం కూడా తక్కువ ధరలకే ప్రజలను తమ గమ్యస్థానాలకు చేర వేయగలుగుతుంది.అయితే సొంత వాహనాలు తక్కువ మందికి ఉండటం వల్ల ప్రభుత్వం దాదాపు అన్ని ప్రదేశాల్లో వాహనాలను అందుబాటులోకి తెచ్చింది.







